kumaram bheem asifabad- పురుగుల మందుతో జాగ్రత్త
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:00 PM
పంట లకు ఇటీవల కాలంలో రసాయనిక మందుల వాడ కం గణనీయంగా పెరిగింది. వివిధ రకాల పురుగు లు, తెగుళ్లను నివారించేందుకు రైతులు ప్రమాదక రమైన మందులను ఆశ్రయిసున్నారు. కానీ పురుగుల మందు పిచికారి చేసే సమ యంలో రైతులు జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల అస్వస్థతకు గురవుతున్నారు.
- నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం
వాంకిడి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పంట లకు ఇటీవల కాలంలో రసాయనిక మందుల వాడ కం గణనీయంగా పెరిగింది. వివిధ రకాల పురుగు లు, తెగుళ్లను నివారించేందుకు రైతులు ప్రమాదక రమైన మందులను ఆశ్రయిసున్నారు. కానీ పురుగుల మందు పిచికారి చేసే సమ యంలో రైతులు జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల అస్వస్థతకు గురవుతున్నారు. ఓ వైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎప్పటిక ప్పుడు అధిక డిగుబడినిచ్చే విత్తనాలను రూపొందిస్తుండగా, మరో వైపు ఆ పంటలపై ఆశించే చీడపీడల నుంచి పంటను కాపాడేందుకు రైతులు క్రిమిసంహరక మందులు వాడడం పరిపాటిగా మారింది. ఆయా పంటలకు జరిగే నష్టంలో దాదాపు 20-25 శాతం చీడపీడల వల్లే కలుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తి, వరిలో పురుగు నివారణకు రైతులు ఒక్కటికి రెండు సార్లు పురుగుల మందులు పిచికారి చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి జిల్లాలో పత్తి పంటపై పురుగుమందులు పిచికారి చేయ డంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొంత మంది రైతులు వృత్యువాత పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు రైతులు మందు ప్రభావంతో ఆస్వస్తతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందారు.
- అవగాహన లేక..
పురుగుల మందుల వాడకంపై రైతులకు పెద్దగా అవగాహన ఉండడంలేదు. గ్రామాల్లో ఫెర్టిలైజర్ డీలర్లు పురుగులమందుల వ్యాపారులు చెప్పె మందులనే చిపికారీ చేస్తున్నారు. ఒక్కో కంపెనీ తయారు చేసే మందు ప్రభావం ఒక్కో రకంగా ఉండి పిచికారీ చేసే వ్యక్తిపై తీవ్ర ప్రభా వం చూపుతుంటుంది. ఏ పురుగుకు ఏ మోతా దులో ఏ మందు వాడాలో రైతులకు తెలియని పరిస్థితి ఉంది. కొన్ని రసాయన మందులు ఘా టైన వాసన కలిగి ఉంటే మరికొన్ని తేలికగా ఉం టాయి. రైతులు ఇవేమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులను పిచికారి చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.
- పచికారి సమయంలో నిర్లక్షం..
చాలా మంది రైతులు రసాయన మందులు పిచికారి చేసేటప్పడు బీడీలు, సిగరేట్లు తాగడం, గుట్కా నమలడం, తంబాకు నోట్లో వేసుకోవడం చేస్తుంటారు. అలాగే మద్యాహ్న సమయంలో భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో కాకుండా కేవలం నీళ్లతో మీదమీద కడిగి భోజనం చేస్తుంటారు. దీంతో మందు ప్రభావం తమకు తెలి యకుండానే వివిధ రూపాల్లో మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో మనిషి నాడి వ్యవస్థ, శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే గాలి ఏ వైపు నుంచి వీస్తుందో గమనించక ఇష్టమొచ్చినట్లు పిచికారి చేస్తుంటారు. దీంతో రసా యన మందు గాలిలో కలిసి శ్వాస తీసుకుంటున్న ప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లి వాంతులు కావడం, తలతిప్పడం, శరీరమంతా చెమటలు పట్టడం, సరైన శ్వాస అందకపోవడం వంటివి జరుగుతుంటాయి.
- జాగ్రత్తలు పాటించాలి..
- డాక్టర్ వినయ్, వైద్యాధికారి. వాంకిడి
రైతులు, రైతు కూలీలు పురుగు మందు పిచికారి సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. స్ర్పేయర్లుకు లీకే జీలు లేకుండా చూసుకోవాలి. మందు నీళ్లు శరీరం పై పడకుండా లూజు దుస్తులు ధరించాలి. పురుగు మందు పిచికారి పూర్తయిన తర్వాత తలభాగం నుంచి సబ్బుతో స్నానం చేయాలి. పిచికారి చేసే వ్యక్తికి ఏవైనా గాయాలుంటే అవి కనబడకుండా ప్లాస్టర్ వేసుకోవాలి. పురుగుమందు పిచికారి సమయంలో ఏమైనా అనారోగ్యానికి గురైతే సమీ పంలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. మందు ప్రభా వం ఎంత గాఢతదో తెలుసుకునేందుకు మందు డబ్బాను వైద్యుడికి చూపించాలి.
- సిఫారుసు మేరకు వాడాలి..
- గోపికాంత్- మండల వ్యవసాయ అధికారి
పురుగుమందులు ఏ సమయంలో వాడాలో చా లా మంది రైతులకు తెలియడం లేదు. ముందుగా సాగు చేసిన పంటలను రెండు మూడు రోజుల కోసారి పరిశీలించాలి. ఏ పురుగువల్ల ఎలాంటి నష్టం జరుగుతుందనే దానిపై అవగాహనకు వచ్చి న తర్వాత మందులు వాడాలి. అధికారుల సూచ నల మేరకు పురుగుమందులు పిచికారి చేయాలి.