సమాజ సేవలో ముందుండాలి
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:34 PM
స్వచ్ఛంద సంస్థలు సమాజ సేవలో ముందుండి ఆద ర్శంగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ టౌన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : స్వచ్ఛంద సంస్థలు సమాజ సేవలో ముందుండి ఆద ర్శంగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ కా లనీలోని చేయూత వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధు లు సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కా ర్యక్రమాలను ఆయనకు వివరించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ చేయూత స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరిం త విస్తృతం చేయాలని, అందుకు తనవంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంస్థల సభ్యులు శ్రీనివాసులు, భాస్కర్, నిరంజన్‌యాదవ్ పాల్గొన్నారు.