Share News

అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:12 PM

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణను క లెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆకస్మికంగా పరిశీలిం చారు.

అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణను క లెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆకస్మికంగా పరిశీలిం చారు. నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ బాలుర జూ నియర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడి యట్‌ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌ పరీక్షా ప్రక్రియను కలెక్ట ర్‌ తనిఖీ చేశారు. పరీక్షలు పూర్త య్యే వరకు సిబ్బంది అప్రమత్తం గా ఉండాలని, ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. విద్యార్థులకు తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు, మెడికల్‌ సౌకర్యాలు అందుబాటులో ఉ న్నాయా అని జిల్లా ఇంటర్మీడి యట్‌ అధికారి ని ప్రశ్నించారు. సీసీ కెమెరాలు సక్రమంగా పని చే స్తున్నాయా అనితనిఖీ చేసి కంట్రోల్‌ రూం నుం చి ప్రతీపరీక్షా గదిని పరిశీలించారు. ప్రశ్నాప త్రాలను నిర్ణీత సమయానికి తెరిచారా? వంటి అంశాలపై కళాశాల సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. జిల్లా వ్యాప్తంగా నేడు జరిగిన ఇంటర్‌ పరీక్షకు 5,968మంది విద్యార్థులకు గాను 5,806 మంది విద్యార్థులు హాజరు కాగా 107 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి వెంకటరమణ తెలిపారు.

Updated Date - Feb 26 , 2026 | 11:13 PM