Share News

BC JAC Chairman Srinivas Goud: మునిసిపోల్స్‌లోనూ బీసీలకు అన్యాయం: జాజుల

ABN , Publish Date - Jan 18 , 2026 | 05:16 AM

గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే మునిసిపల్‌ ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు.

BC JAC Chairman Srinivas Goud: మునిసిపోల్స్‌లోనూ బీసీలకు అన్యాయం: జాజుల

హైదరబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే మునిసిపల్‌ ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. శనివారం బీసీభవన్‌లో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లు పెంచేవరకు మునిసిపల్‌ ఎన్నికలు జరపబోమని చెప్పిన పాలకులు, ఇప్పుడు మాట తప్పి కేవలం 31 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లడం బీసీ సమాజాన్ని వంచించడమేనని ధ్వజమెత్తారు. బీసీలకు ద్రోహం చేస్తున్న పార్టీలను రాజకీయంగా బొంద పెట్టక తప్పదని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు బీసీల పక్షాన నిలబడకుండా ఎన్నికలకు సిద్ధమనడం సిగ్గుచేటని విమర్శించారు. తక్షణమే మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ నిలిపివేసి, 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా 19న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.

Updated Date - Jan 18 , 2026 | 05:16 AM