Share News

జాతీయ జనగణనపై బీసీల ఆగ్రహం

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:20 PM

కేంద్ర ప్రభుత్వం చేప ట్టిన జాతీయ జన గణనలో ఓబీసీ కా లమ్‌ లేకపోవడంపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ జనగణనపై బీసీల ఆగ్రహం
నాగర్‌కర్నూల్‌లోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న బీసీ సంఘం నాయకులు

నాగర్‌కర్నూల్‌టౌన్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం చేప ట్టిన జాతీయ జన గణనలో ఓబీసీ కా లమ్‌ లేకపోవడంపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా లో బీసీ సంఘం ఆధ్వర్యంలో గెజిట్‌ పత్రాలను చించి, తగులబెట్టి తమ నిరసన తెలిపారు. గత పార్లమెంట్‌ ఎ న్నికల ముందు ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ జన గణనతో పాటు ఓబీసీ గణనను ప్రత్యేకంగా చేపడుతామని మాట ఇచ్చి మరిచారని విమర్శించా రు. జనగణనలో ఓబీసీ కాలమ్‌ పెట్ట కపోవడం దేశవ్యాప్తంగా ఉన్న 70కోట్ల ఓబీసీల అత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లేనని ఆవే దన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 27 మంది ఓబీసీ మంత్రులు వెంటనే రాజీనా మా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో బీసీ సంఘం నాయకులు అరవిందచా రి, కాళ్ల నిరంజన్‌, సత్యశీల సాగర్‌, మల్లేష్‌గౌడ్‌, శివశం కర్‌, కాశన్న, రేణుక, శ్రీనివాస్‌ ఆవుల శ్రీను, తిరుపతయ్య, సుధాకర్‌ గౌడ్‌ ఉన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:20 PM