Share News

గురుకుల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:02 AM

రాష్ట్రంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యాప్రమాణాల పెంపునకు వినూత్నంగా అకడమిక్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయాలి.

గురుకుల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

  • అందరికీ హెల్త్‌ కార్డులందించాలి: మంత్రి పొన్నం

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యాప్రమాణాల పెంపునకు వినూత్నంగా అకడమిక్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయాలి. విద్యార్థులందరికీ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యక్తిగత హెల్త్‌ రికార్డులను అందించాలి’’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. మినిస్టర్‌ క్వార్టర్స్‌లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి శాఖాపరమైన ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీల సమగ్ర అభివృద్ధి, పథకాల అమలుకు సంబంధించి క్షేత్రస్థాయి కార్యాచరణను రూపొందించేందుకు ఈ నెల మూడో వారంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారులు, సహాయ అధికారులతో రాష్ట్రస్థాయి మేధో మథనం నిర్వహించనున్నట్లు తెలిపారు. రా బోయే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగ యు వతకు అండగా నిలవాలని సూచించారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో తక్షణమే ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు.

Updated Date - Jun 08 , 2026 | 06:03 AM