Share News

బీసీల ఆకాంక్షలను నెరవేర్చకుంటే..కాంగ్రెస్‌కు ముప్పు తప్పదు

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:59 AM

బీసీల ఆకాంక్షలను గౌరవించకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ భారీ రాజకీయ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు...

బీసీల ఆకాంక్షలను నెరవేర్చకుంటే..కాంగ్రెస్‌కు ముప్పు తప్పదు

  • రాహుల్‌గాంధీకి జాజుల లేఖ

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): బీసీల ఆకాంక్షలను గౌరవించకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీ భారీ రాజకీయ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ హెచ్చరించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని శ్రీనివా్‌సగౌడ్‌ ఆయనకు బహిరంగ లేఖ రాశారు. దేశవ్యాప్త కులగణన, జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలన్న రాహుల్‌గాంధీ నినాదానికి రాష్ట్రాన్ని మోడల్‌గా మార్చాలని సూచించారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన 42శాతం బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.

Updated Date - Mar 02 , 2026 | 01:59 AM