Share News

జనరల్‌ కోటాలోనూ బీసీలే రాణించాలి: పొన్నం

ABN , Publish Date - May 15 , 2026 | 04:58 AM

సామజిక న్యాయం జరగాలంటే అన్ని రంగాల్లో బీసీలు ముందుండాలని, జనరల్‌ కోటాలో కూడా 50 శాతం బీసీలే రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

జనరల్‌ కోటాలోనూ బీసీలే రాణించాలి: పొన్నం

  • బీసీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత

హైదరాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): సామజిక న్యాయం జరగాలంటే అన్ని రంగాల్లో బీసీలు ముందుండాలని, జనరల్‌ కోటాలో కూడా 50 శాతం బీసీలే రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన గురుకుల సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు హైదరాబాద్‌లోని కొమురంభీం భవన్‌లో గురువారం ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరానికి మొత్తం 508 మంది ప్రతిభావంతులను సన్మానిస్తున్నామని తెలిపారు. పదో తరగతిలో జ్యోతీ బాపూలే గురుకుల పాఠశాలలు 98.99 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర సగటును మించాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో కూడా పలుచోట్ల 100శాతం ఫలితాలు నమోదయ్యాయని చెప్పారు. బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించారని ముఖ్యంగా రెండో సంవత్సరంలో 71.85శాతం ఉత్తీర్ణత నమోదు కావడం గర్వకారణమన్నారు. అయితే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాలు 51శాతం మాత్రమే వచ్చాయని, ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచించారు.

Updated Date - May 15 , 2026 | 04:58 AM