బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:32 PM
చట్ట సభల్లో బీసీల స్థానా లు పెంచేందుకు పార్లమెంటులో బీసీ రిజ ర్వేషన్లు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గు పల్లి కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు.
- బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్
నాగర్‌కర్నూల్ టౌన్, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : చట్ట సభల్లో బీసీల స్థానా లు పెంచేందుకు పార్లమెంటులో బీసీ రిజ ర్వేషన్లు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గు పల్లి కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని జాతీయ బీసీ సం క్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశం ని ర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యా ప్తంగా బీసీ కులాల సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహించాలని, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. అ లాగే బీసీ ఉద్యోగ నియామకాల్లో క్రిమీలేయర్ విధానాన్ని రద్దు చేయాలని, బీసీలపై జరిగే వి వక్షను అరికట్టేందుకు ప్రత్యేక బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేష న్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమా వేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మ డి జిల్లా అధ్యక్షుడు కాళ్లనిరంజన్, జిల్లా వ ర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్‌గౌడ్, బీసీ రైతు సంఘం అధ్యక్షుడు నిరంజన్‌యాదవ్, మహిళా అధ్యక్షురాలు రేణుక, నాయకులు సు ధాకర్‌గౌడ్, కొడుగు రాజు, నేష లక్ష్మయ్య, మౌ లానా తదితరులు పాల్గొన్నారు.