Share News

కుమ్మెరలో అగ్రకుల దౌర్జన్యాలపై సీబీఐ విచారించాలి:బీసీ నేతలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:47 AM

నాగర్‌ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతరలో రజక దంపతులను గుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకుని అగ్రకులాల...

కుమ్మెరలో అగ్రకుల దౌర్జన్యాలపై సీబీఐ విచారించాలి:బీసీ నేతలు

న్యూఢిల్లీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): నాగర్‌ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతరలో రజక దంపతులను గుడిలోకి ప్రవేశించకుండా అడ్డుకుని అగ్రకులాల వాళ్లు దౌర్జన్యానికి పాల్పడ్డారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రకులాల దాడిలో పసిపిల్ల మరణించడం సభ్య సమాజానికి తలవంపు అని, ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ర్యాగ అరుణ్‌ కుమార్‌ అధ్యక్షతన జంతర్‌మంతర్‌ వద్ద భారీ ధర్నా జరిపారు. ఈ సందర్భంగా అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కుమ్మెర ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం నిందితులను కాపాడుతుందని ధ్వజమెత్తారు. బీసీలపై జరుగుతున్న దాడులను, దౌర్జన్యాలను అరికట్టాలంటే ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా బీసీలకు ‘‘బీసీ రక్షణ చట్టం’’ తేవాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 01 , 2026 | 04:47 AM