బీసీల ద్రోహి కాంగ్రెస్ సర్కారు: జాజుల
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:48 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీల డిమాండ్లను చర్చించకుండా తీవ్ర నిరాశకు గురిచేసిందని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల...
హైదరాబాద్, గన్‌పార్క్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీల డిమాండ్లను చర్చించకుండా తీవ్ర నిరాశకు గురిచేసిందని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో బీసీలను వంచించి బీసీల ద్రోహిగా కాంగ్రెస్ సర్కారు నిలిచిందన్నారు. వెంటనే బీసీ సబ్‌ప్లాన్‌కు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణే్‌షచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను అన్ని రంగాల్లో అణచివేస్తున్నారని ఆరోపించారు.