స్పష్టత ఇవ్వకుంటే కౌన్సెలింగ్ అడ్డుకుంటాం: జాజుల
ABN , Publish Date - May 26 , 2026 | 04:40 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుపై స్పష్టత లేకుండానే సర్కారు ఈ నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌లు చేపట్టడం సరికాదని బీసీ...
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుపై స్పష్టత లేకుండానే సర్కారు ఈ నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌లు చేపట్టడం సరికాదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాత పద్ధతి ప్రకారమే ఫీజు రీయుంబర్స్‌మెంట్‌ను అమలు చేస్తామని ప్రకటించిన తర్వాతనే కౌన్సెలింగ్ చేపట్టాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. లేదంటే కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. గత నాలుగేళ్లుగా పెండింగ్ బకాయిలు విడుదల చేయకుండా.. విద్యార్థుల జీవితాలతో సర్కారు ఆడుకుంటోందని విమర్శించారు.