కోమటిరెడ్డి మంత్రి పదవి తీసేయాలి: జాజుల
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:27 AM
బీసీలను అవమానిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): బీసీలను అవమానిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ డిమాండ్ చేశారు. జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరడంతో బీసీలపై ఆయనకున్న వ్యతిరేకత వెల్లడవుతోందన్నారు. మహేశ్‌గౌడ్ పీసీసీ అధ్యక్షుడయ్యాక రాష్ట్రంలో బీసీ కులగణన జరిగిందని, పార్టీ పదవుల్లో 70శాతం బహుజనులకు కేటాయించారని, డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించారని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు అధిక సంఖ్యలో విజయం సాధించారని పేర్కొన్నారు.