Share News

kumaram bheem asifabad- బీసీలే అధికం..

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:02 AM

కులాల వారీగా వివరాలను వెల్లడించింది. కుమరం బీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 మండలాల్లో 5,57,464 మంది జనాభా ఉండగా ఇందులో బీసీలు 40.10 శాతంగా ఉన్నారు. ఎస్టీలు 30.8, ఎస్సీలు 15.46 శాతం, బీసీ (ముస్లీం మైనార్టీలు) 6.27 శాతం, ఓసీలు 8.08 శాతంగా ఉండగా ఓసీ(ముస్లీం మైనార్టీలు) 27.25శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం కులాల వారీగా వివరాలు వెల్లడించింది. కుల గణనలో సేకరించిన ఆర్థిక సామాజిక విద్య రాజకీ య రంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాలను ప్రభుత్వం వెల్లడించడం జరిగింది.

kumaram bheem asifabad- బీసీలే అధికం..
లోగో

- బీసీలు 40.10,- ఎస్టీలు 30.8, ఎస్సీలు 15.46 శాతం

- బీసీ మైనార్టీలు 6.27, ఓసీలు 8.09 శాతం

- కులాల వారీగా వివరాలను వెల్లడించిన ప్రభుత్వం

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా వివరాలను వెల్లడించింది. కుమరం బీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 మండలాల్లో 5,57,464 మంది జనాభా ఉండగా ఇందులో బీసీలు 40.10 శాతంగా ఉన్నారు. ఎస్టీలు 30.8, ఎస్సీలు 15.46 శాతం, బీసీ (ముస్లీం మైనార్టీలు) 6.27 శాతం, ఓసీలు 8.08 శాతంగా ఉండగా ఓసీ(ముస్లీం మైనార్టీలు) 27.25శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం కులాల వారీగా వివరాలు వెల్లడించింది. కుల గణనలో సేకరించిన ఆర్థిక సామాజిక విద్య రాజకీ య రంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాలను ప్రభుత్వం వెల్లడించడం జరిగింది.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లా వ్యాప్తంగా ఉన్న జనాభాలో బీసీలు 40.10 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం బుధవారం కులాల వారీగా విడుదల చేసిన గణాంకాల వివరాల ఆధారంగా తెలిసింది. బీసీల్లో 134 ఉప కులాలు ఉండగా జిల్లాలో బీసీ(ఎ) క్యాటగిరిలో అగ్నికులక్షత్రియ, బెస్త, గంగపుత్ర ఉప కులాలకు చెందిన వారు 15,482 మంది ఉండగా 5.99 శాతంగా ఉన్నారు.. రజక(చాకలి) 4982 మంది(1.93 శాతం), నాయిబ్రాహ్మణ 3717(1.44 శాతం), వడ్డే 2433 (0.94 శాతం ) మంది ఉన్నారు. బీసీ(బి) క్యాటగిరిలో గౌడ 5451 (2.11శాతం)మంది, దూదేకుల, లడ్డాబ్‌ 3652 (1.41 శాతం) మంది, గాండ్ల, తేలి 7118 (2.75 శాతం), పెరిక 2369 (0.92 శాతం) మంది, పద్మశాలి 9234 (3.57 శాతం), గోల్డ్‌ స్మిత్‌ 2344 (0.91 శాతం), బ్లాక్‌ స్మిత్‌ 1969 (0.76 శాతం), వడ్రంగి, వడ్ల 3034 (1.17 శాతం) మంది, ఉన్నారు. బీసీ(సి) క్యాటగిరిలో 390 మంది ఉన్నారు. బీసీ(డి) క్యాటగిరిలో అరెకటిక 2206 (0.85 శాతం)మంది, మేర 2361 (0.91 శాతం), మాలి(బారె) 56,140 (21.72 శాతం) మంది, ముదిరాజ్‌ 4140 (1.60 శాతం), మున్నూరు కాపు 23,234 (8.99 శాతం), వంజర 2482 (0.96 శాతం), యాదవ (గొల్ల) 16016 (6.20 శాతం) మంది, ఆరె 44352 (17.16 శాతం) మంది ఉన్నారు. బీసీ(ఈ) క్యాటగిరిలో షేక్‌లు 29,722 (11.50 శాతం) మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జానాభాలో ఎస్సీలు 15.46 శాతంగా ఉన్నారు. ఇందులో మాదిగలు 22,159 (25.70 శాతం) మంది, మాహోర్‌లు 18,596 (21.57 శాతం) మంది, మాల/మాల అయ్యవార్‌ 24,353 (28.25 శాతం) మంది, మాలసాలి/నేతకాని 13,396 (15.54 శాతం), మంగ్‌ 4124 (4.78 శాతం)మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జనాభాలో ఎస్టీలు 30.8 శాతం ఉన్నారు. ఇందులో గోండు, నాయక్‌పోడ్‌ 75,312 (44.91శాతం) మంది, కోలాం/కోలావార్‌ 40,506 (24.16 శాతం), ఆంద్‌/సాదు అంధ్‌ 4635(2.76 శాతం), లంబాడ/బంజార 22,685 (13.53 శాతం) మంది, కోయ ఉప కులాలు 17,470 (10.42 శాతం) మంది, ప్రధాన్‌ 4141 (2.47 శాతం) మంది ఉన్నారు. జిల్లాలో 8.09 శాతం ఓసీ జనాభా ఉంది., ఇందులో బ్రాహ్మణులు 1612 (3.58 శాతం) మంది, వైశ్య(కోమటి) 4417 (9.80 శాతం)మంది, వెలమ 266 (0.59 శాతం) మంది, రెడ్డి 350 (0.78 శాతం) మంది, ఓసీ (ముస్లీం మైనార్టీ)లు 12,277 (27.25 శాతం) మంది, ఇతరులు 13,842 (30.73 శాతం) మంది, ఎలాంటి కులం లేని వారు 9471 (21.02 శాతం) మంది ఉన్నారు.

కుమరం భీం జిల్లా ఎస్సీ జనాభా వివరాలు

===========================

మాదిగ 22,159 25.70 శాతం

మాల/ మాల అయ్యవారు 24,353 28.25 శాతం

మహోర్‌ కులస్తులు 18,596 21.57 శాతం

నేతకాని/మాలశాలె 13,396 15.54 శాతం

==============================================

మొత్తం 88,504

====================================================

కుమరం భీం ఎస్టీ జనాభా వివరాలు

================================

గోండు/ నాయక్‌పోడ్‌ 75.,312 44.91 శాతం

కోలాం/ కోలావార్‌ 40,506 24.16 శాతం

లంబాడా/బంజార 22,685 13.53 శాతం

కోయఉపకులాలు 17,470 10.42 శాతం

=====================================================

మొత్తం 1,515,973

==================================================

కుమరం భీం బీసీ జనాభా వివరాలు

=======================================

మాలి,/బారే 56.140 21..72 శాతం

ఆరె 44,362 17.16 శాతం

మున్నూరుకాపు 23,234 8.99 శాతం

యాదర్‌/గొల్ల,కురుమ 16,016 6.20 శాతం

================================================

మొత్తం 1,97,552

=================================================

కుమరం భీం ఓసీ జనాభా వివరాలు

=====================================================

ఆర్య వైశ్య (కోమటి) 4,417 9,80

రెడ్డి 350 0.78

వెలమ 266 0.59

బ్రాహ్మణ 1,612 3,58

ఓసీ ముస్లిం, మైనార్టీ 12.227 27.25

======================================================

మొత్తం 28,872

======================================================

జనాభా కులాల వారీగా

========================================

ఎస్సీ 86,207 15.46 శాతం

ఎస్టీ 1,67,680 30.08 శాతం

బీసీ 2,23,563 40.10 శాతం

ఓసీ 45,051 8.09 శాతం

ఇతరులు 34.963 6.07 శాతం

================================

మొత్తం 557,501

Updated Date - Apr 17 , 2026 | 12:02 AM