17న విజయవాడలో బీసీల మేధోమథనం
ABN , Publish Date - May 16 , 2026 | 04:20 AM
ఈ నెల 17న విజయవాడలో బీసీల మేధోమధన సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల వెల్లడి
హైదరాబాద్, మే 15(ఆంధ్రజ్యోతి): ఈ నెల 17న విజయవాడలో బీసీల మేధోమధన సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేశన శంకర్ రావు ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో బీసీ మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, న్యాయమూర్తులు, బీసీ ఉద్యమకారులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జనగణలో బీసీ కులగణన, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, సామాజిక రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేత, ఢిల్లీ కేంద్రంగా జరగబోయే బీసీ గర్జనపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. భవిష్యత్ బీసీ తరాల కోసం విజయవాడ డిక్లరేషన్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.