Share News

జనగణనలో బీసీలను లెక్కించాల్సిందే

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:30 AM

కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే సమగ్ర జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కిం చాల్సిందేనని పలు రాష్ట్రాల ఎంపీలు కోరారు.

జనగణనలో బీసీలను లెక్కించాల్సిందే

  • ఢిల్లీలో బీసీల మహాధర్నా.. పలువురు ఎంపీల హాజరు

న్యూఢిల్లీ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే సమగ్ర జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కిం చాల్సిందేనని పలు రాష్ట్రాల ఎంపీలు కోరారు. సోమవారం జంతర్‌మంతర్‌లో బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌ అధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, అంబికా లక్ష్మీనారాయణ, బస్తీపాటి నాగరాజు, మల్లు రవి సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 16 మంది ఎంపీలు, 15 రాష్ట్రాల ఓబీసీ నాయకులు హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బీసీ కులగణనపై ప్రత్యేకంగా చర్చించి, స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జాతీయస్థాయిలో జేఏసీ ఏర్పాటుచేసి, బస్సు యాత్ర చేపట్టి లక్షలాది మందితో ఢిల్లీలో ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ కులగణనపై తమ అధినేత చంద్రబాబుతో చర్చించి ఆయన ద్వారా ప్రధాని మోదీపై ఒత్తిడి తెస్తామని టీడీపీ ఎంపీలు అప్పలనాయుడు, లక్ష్మీనారాయణ, నాగరాజు చెప్పారు. బీసీ కులగణన చేస్తామని విధాన నిర్ణయం ప్రకటించిన కేంద్రం ఇప్పుడు మాట తప్పిందని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేత వీ శ్రీనివా్‌సగౌడ్‌, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకర్‌రావు, బీసీ జేఏసీ వర్కింగ్‌ చైర్మన్‌ గుజ్జకృష్ణ, వివిధ సంఘాల నేతలు కుల్కచర్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 05:30 AM