జెన్‌కో కార్యాలయంలో బీసీ కమిషన్ విచారణ
ABN , Publish Date - May 12 , 2026 | 04:14 AM
రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అమలు తీరుపై బీసీ కమిషన్ తన విచారణను ముమ్మరం చేసింది..
ఉద్యోగ రిజర్వేషన్ల అమలుపై ఆరా
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అమలు తీరుపై బీసీ కమిషన్ తన విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్, ట్రాన్స్‌కో కార్యాలయాల్లో విచారణ పూర్తి చేసిన కమిషన్ సోమవారం జెన్‌కో కార్యాలయాన్ని సందర్శించింది. 2014 నుంచి జరిగిన నియామకాల్లో అనుసరిస్తున్న పద్ధతులను, ముఖ్యంగా బీసీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించినప్పటికీ రిజర్వేషన్ కేటగిరీ కింద నియమించిన అభ్యర్థుల వివరాలపై కమిషన్ ప్రత్యేకంగా ఆరా తీసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని సమర్పించాలని జెన్‌కో సీఎండీ హరీశ్‌ను ఆదేశించింది.