Share News

జనగణనలో కులగణన చేపట్టాలి

ABN , Publish Date - May 24 , 2026 | 04:54 AM

జన గణనలో భాగంగా బీసీ కుల గణనను కూడా చేపట్టవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని, ఇది కుల గణన వ్యతిరేకులకు చెంపపెట్టు వంటిదని....

జనగణనలో కులగణన చేపట్టాలి

  • బీసీ సంఘాల జేఏసీ.. భట్టి విక్రమార్కతో భేటీ

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): జన గణనలో భాగంగా బీసీ కుల గణనను కూడా చేపట్టవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని, ఇది కుల గణన వ్యతిరేకులకు చెంపపెట్టు వంటిదని బీసీ సంఘాలు తెలిపాయి. తెలంగాణలో కుల గణన కోసం కృషి చేశారంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీసీ సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంఘాల జేఏసీ నాయకుడు దేవరకొండ సైదులు ఆధ్వర్యంలో బీసీ కులసంఘాల ప్రతినిధులు శనివారం భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కేంద్ర ప్రభుత్వం తన మనసు మార్చుకుని, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మొదటి విడత జన గణనలోనే కుల గణనను కూడా చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 24 , 2026 | 04:54 AM