Union Minister Kishan Reddy: వైద్య విద్యలో అగ్రగామిగా బీబీనగర్ ఎయిమ్స్
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:59 AM
ప్రపంచ స్థాయి వైద్య విద్య, అందరికీ అందుబాటులో వైద్య సేవలను అందించాలన్న సంకల్పానికి బీబీనగర్ ఎయిమ్స్ నిదర్శనంగా నిలుస్తోందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ స్థాయి వైద్య విద్య, అందరికీ అందుబాటులో వైద్య సేవలను అందించాలన్న సంకల్పానికి బీబీనగర్ ఎయిమ్స్ నిదర్శనంగా నిలుస్తోందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వైద్య విద్య, పరిశోధన, ప్రజలకు వైద్యసేవలు అందించడంలో అగ్రగామి కేంద్రంగా బీబీనగర్ ఎయిమ్స్ ఎదుగుతుండడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇప్పటివరకు 7 బ్యాచ్‌ల్లో 609 మంది విద్యార్థులు వైద్యవిద్యలో ప్రవేశం పొందారని, 15 లక్షల మందికి పైగా ఓపీ చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అకడమిక్, వసతిగృహ భవన నిర్మాణాలు పూర్తయ్యాయని, ఆస్పత్రి కొత్త బ్లాక్‌లు, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్‌లు ఈ ఏడాదిలో పూర్తవుతాయని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.