అచ్చంపేటలో బతుకమ్మ సంబురాలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:46 PM
బతుకమ్మ సంబురాలు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి.
- ఆడిపాడిన మహిళలు
- పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
- తీరొక్కపూలతో రంగురంగుల బతుకమ్మలు
అచ్చంపేటటౌన్/ కొల్లాపూర్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : బతుకమ్మ సంబురాలు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. అచ్చంపేట పట్టణం లోని ఐలవ్యూ అచ్చంపేట మైదానంలో ఏర్పా టు చేసిన బతుకమ్మ వేడుకలకు నియోజకవ ర్గంలోని వివిధ మండలాల నుంచి మహిళలు తీరోక్క పూలతో తయారుచేసిన బతుకమ్మలను తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ దంప తులతో పాటు నాయకులు పాల్గొన్నారు.
కొల్లాపూర్లో బతుకమ్మ వేడుకలను మునిసి పల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతిసత్యం, వైస్ చైర్మన్ షేక్ రహీంపాషా, మునిసిపల్ కౌన్సిలర్లు ప్రా రంభించారు. పట్టణంలోని బండాయగుట్ట వెంక టేశ్వరాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి పట్టణాన్ని బ తుకమ్మలమయం చేశారు. కొల్లాపూర్ మునిసి పల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ మహిళలు పాల్గొన్నారు.