kumaram bheem asifabad- బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
ABN , Publish Date - Oct 18 , 2026 | 10:08 PM
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. హరిహరి ఓ దేవ ఉయ్యాలో.. హరియో బ్రహ్మదేవ ఉయ్యాలో.. అంటూ మహిళలు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుక ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. తీరొక్క పూలను సేకరించి ఇళ్లలో బతుకమ్మను పేర్చారు. ఆయా ఆలయాల్లో, గ్రామాల కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు
- ఉత్సాహంగా పాల్గొన్న యువతులు, మహిళలు
ఆసిఫాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. హరిహరి ఓ దేవ ఉయ్యాలో.. హరియో బ్రహ్మదేవ ఉయ్యాలో.. అంటూ మహిళలు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుక ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగింది. తీరొక్క పూలను సేకరించి ఇళ్లలో బతుకమ్మను పేర్చారు. ఆయా ఆలయాల్లో, గ్రామాల కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు. అనంతరం శోభాయాత్రగా బతుకమ్మలను తీసుకెళ్లి సమీప చెరువులు, వాగుల సమీపంలో సామూహికంగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. హరిహరి ఓ దేవ ఉయ్యాలో.. హరియో బ్రహ్మదేవ ఉయ్యాలో.. అంటూ మహిళలు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. ఆలయ ప్రాంగణాల్లో, వీధులు, కూడళ్ల వద్ద మహిళలు బతుకమ్మ ఆటల సందడి కనువిందు చేసింది. చిన్నా పెద్ద తేడా లేకుండా మహిళలు సంప్రదాయ వస్త్రాలంకరణలతో లయ బద్దంగా ఆడుతూ.. పాడుతూ.. సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు పోటీ పడి విభిన్న రూపాల్లో బతుకమ్మలను పేర్చి అందంగా తీర్చిదిద్దారు. నూతన వస్త్రాలు, నగలు ధరించి ఒక్క చోట చేరి బతుకమ్మ చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ ఆడడంతో పాటు యువతులు, మహిళలు కోలాటం ఆడారు. పట్టణంలో బ్రాహ్మణ్వాడ, రావులవాడ, కన్యకాపరమేశ్వరి ఆలయం, పొట్టి శ్రీరాములు చౌక్, కంచుకోట, తారక రామానగర్, రాజంపేట, సాయినగర్, పైకాజీనగర్, బజార్వాడీ, హనుమాన్ మందిర్, హడ్కో కాలనీ, సందీప్నగర్, జన్కాపూర్, దస్నాపూర్లో కాలనీల్లో మహిళలు ఆడి పాడారు.ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గొడవెల్లి పెద్దవాగు సమీపంలో బతుకమ్మలను నిమజ్జించేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. మున్సిపల్ కమీషనర్ అంజయ్య నేతృత్వంలో సిబ్బంది వీధి దీపాలు ఏర్పాటు చేసి బతుకమ్మ అడేందుకు ప్రత్యేక అలంకరణతో వేదికను ముస్తాబు చేశారు. సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ నితికాపంత్ ఆదేశాల మేరకు డీఎస్పీ అశోక్, సీఐ నీలం రవి ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు. కాగజ్నగర్ పట్టణంతో పాటు జిల్లాలోని సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి మండలాల్లో మహిళలు ఆనందోత్సాహాల మధ్య సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు.
కాగజ్నగర్/సిర్పూరు(టి)/బెజ్జూరు/కౌటాల/చింతలమానేపల్లి/ దహెగాం/పెంచికల్పేట/ కెరమె రి/ తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): కాగజ్నగర్ పట్టణంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎస్పీఎం క్రీడా మైదనంలో మహిళలందరు కలిసి బతుకమ్మ ఆటలను ఆడారు. ఈ సందర్భంగా ఎస్పీఎం యాజమాన్యం పూర్తి ఏర్పాట్లను చేసింది. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ఇంటిలో బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి బతుకమ్మను పేర్చి మహిళలతో ఆటపాట ఆడారు. అలాగే సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సతీమణి కోనేరు రమాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేసి బతుకమ్మ వద్ద పూజలు చేశారు. అలాగే ఎస్పీఎం క్రీడా మైదానంలో బతుకమ్మ ఆటలు పూర్తి చేసుకున్న తర్వాత పెద్దవాగులో నిమజ్జనం చేశారు. అలాగే సర్సిల్క్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. అనంతరం చింతగూడ వాగులో నిమజ్జనం చేశారు. అలాగే సిర్పూరు(టి), కౌటాల, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికల్పేట, కెరమెరి, తిర్యాణి, బెజ్జూరు మండలాల్లో బతుకమ్మ ఆటలను మహిళలు ఘనంగా ఆడారు. అనంతరం సమీప వాగుల్లో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.