Share News

kumaram bheem asifabad- తెరుచుకోని బస్తీ దవాఖానాలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:19 PM

పేదలకు వారి నివాస ప్రాంతాల్లోనే ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు పలు చోట్ల ఆశించిన స్థాయిలో సేవలు అందించలేక మూలన పడుతున్నాయి.వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు అవసరమైన సౌకర్యాల లేమి కారణంగా బస్తీ దవాఖానాల నిర్వహణ ప్రశ్నార్తకంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

kumaram bheem asifabad- తెరుచుకోని బస్తీ దవాఖానాలు
: కాగజ్‌నగర్‌లో తెరుచుకోని బస్తీ దవాఖానా

కాగజ్‌నగర్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): పేదలకు వారి నివాస ప్రాంతాల్లోనే ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు పలు చోట్ల ఆశించిన స్థాయిలో సేవలు అందించలేక మూలన పడుతున్నాయి.వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు అవసరమైన సౌకర్యాల లేమి కారణంగా బస్తీ దవాఖానాల నిర్వహణ ప్రశ్నార్తకంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ప్రారంభించింది. సాధారణ జ్వరాలు, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకు ఉచితంగా వైద్యసేవలు మందులు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రాలను కాగజ్‌నగర్‌లో మూడు చోట్ల ప్రారంభించారు. ప్రారంభంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించినప్పటికీ ప్రస్తుతం అనేక కేంద్రాల్లో పరిస్థితి మారి పోయింది. బస్తీ దవాఖానాల్లో పూర్తి స్థాయిలో వైద్యులు అందుబాటులో లేక పోవడం, సిబ్బంది కొరత ఉండడం వల్ల రోగులు నిరాశ చెందుతున్నారు. ఎప్పుడు మూసివేసి ఉండడంతో విసిగెత్తి పోతున్నారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రిలను ఆశ్రయిస్తున్నారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రజారోగ్య సేవలు గ్రామీణ, పట్టణ పేదలకు చేరువ కావాల్సి ఉంది. కానీ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నేరవడం లేదు. కాగజ్‌నగర్‌ మండలం కోసినిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖా నాకు చెందిన స్థలం తనదేనని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ బస్తీ దవాఖానా కూడా వివాదస్పందగానే ఉంది. అలాగే కాపువాడ, ఆదర్శనగర్‌లో రెండు ఏర్పాటు చేశారు. ఇవీ కూడా వైద్య సేవలు అందక పోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లే దు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బస్తీ దవాఖానాల్లో మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:19 PM