Share News

బసవతారకంలో ప్రత్యేక గదులు గ్యాస్ట్రో కోలోనో వీడియోస్కోప్‌లు

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:59 AM

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి- రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో ఆరోగ్యశ్రీ వార్డులో నవీకరించిన రోగుల గదులు, అధునాతన గ్యాస్ట్రో కోలోనో....

బసవతారకంలో ప్రత్యేక గదులు గ్యాస్ట్రో కోలోనో వీడియోస్కోప్‌లు

  • ప్రారంభించిన ఆస్పత్రి చైర్మన్‌ బాలకృష్ణ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి- రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో ఆరోగ్యశ్రీ వార్డులో నవీకరించిన రోగుల గదులు, అధునాతన గ్యాస్ట్రో కోలోనో వీడియోస్కోప్‌ సౌకర్యాలను ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ సోమవారం ప్రారంభించారు. వాటి కోసం కియా ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) ఆర్థిక సహకారం అందించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మౌలిక సదుపాయాలు చికిత్స పొందుతున్న రోగులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నాయి. ఆస్పత్రి ఆడిటోరియంలో లాంఛనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణకు ఐఓసీఎల్‌ తెలంగాణ, ఏపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (వాణిజ్య) పియూష్‌ మిట్టల్‌, ఐఓసీఎల్‌ హెచ్‌ఆర్‌- సీఎ్‌సఆర్‌ కైలాష్‌ కాంత్‌ ఎండోస్కోపీ పరికరాలను అందజేశారు.

Updated Date - Feb 24 , 2026 | 04:59 AM