Share News

బాసర ట్రిపుల్‌ ఐటీకి మధ్యంతర సెలవులు

ABN , Publish Date - Mar 23 , 2026 | 05:37 AM

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్‌ ఐటీ)లో విద్యార్థిని తేజస్విని మృతి, మౌలిక వసతుల సమస్యలపై గత కొన్ని రోజులుగా విద్యార్థుల నిరసనతో...

బాసర ట్రిపుల్‌ ఐటీకి మధ్యంతర సెలవులు

  • 8 4,500 మంది విద్యార్థులు ఇంటి బాట

  • క్యాంప్‌సలో ఉద్రిక్తత నేపథ్యంలో వర్సిటీ నిర్ణయం

బాసర, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్‌ ఐటీ)లో విద్యార్థిని తేజస్విని మృతి, మౌలిక వసతుల సమస్యలపై గత కొన్ని రోజులుగా విద్యార్థుల నిరసనతో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో వర్సిటీ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాంప్‌సలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పీయూసీ-1తోపాటు ఇంజనీరింగ్‌ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న సుమారు 4,500 మంది విద్యార్థులకు తక్షణమే సెలవులు ప్రకటిస్తూ ఆదివారం అకడమిక్‌ డీన్‌ శీలం శేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థిని మృతిపై విచారణ జరపాలని, వైద్య సేవలు మెరుగుపరచాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో యూనివర్సిటీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తాజా నిర్ణయం తీసుకున్నామని, తరగతులను ఎప్పుడు తిరిగి ప్రారంభమయ్యేది తర్వాత వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - Mar 23 , 2026 | 05:39 AM