బాసర ట్రిపుల్ ఐటీ అల్పాహారంలో బొద్దింక
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:11 AM
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ మెస్ నంబర్ 2లో ఆదివారం ఉదయం అల్పాహారం తింటుండగా, ఓ విద్యార్థి పళ్లెంలో బొద్దింక కనిపించడం కలకలం రేపింది.
విచారణకు అధికారుల ఆదేశం
బాసర, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ మెస్ నంబర్ 2లో ఆదివారం ఉదయం అల్పాహారం తింటుండగా, ఓ విద్యార్థి పళ్లెంలో బొద్దింక కనిపించడం కలకలం రేపింది. ఆహారంలో నాణ్యతా లోపం, అపరిశుభ్రతపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వర్సిటీ అధికారులు సీరియ్‌సగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హెచ్చరించింది. గతంలో కూడా అనేకసార్లు విద్యార్థుల భోజనంలో కీటకాలు కనిపించాయి.