kumaram bheem asifabad- బ్యాంకర్లు రుణ లక్ష్యాలు సాధించాలి
ABN , Publish Date - Nov 26 , 2026 | 10:48 PM
బ్యాంకర్లు నిర్థేశించిన రుణ లక్ష్యాల ప్రకారం రుణాలు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్లో బ్యాంకు అధికారులు, సెర్ప్, మెప్మా, గిరిజన సంక్షేమ, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారులతో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆసిఫాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బ్యాంకర్లు నిర్థేశించిన రుణ లక్ష్యాల ప్రకారం రుణాలు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్లో బ్యాంకు అధికారులు, సెర్ప్, మెప్మా, గిరిజన సంక్షేమ, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారులతో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లకు నిర్థేశించిన లక్ష్యాల ప్రకారం అసంఘటిత రంగాలకు రుణాలను అందించాలని తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగలైన పౌలీ్ట్ర, గేదేల పెంపకం, చేపల పెంపకం వంటి వాటికి రుణాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు. ప్రధానమంత్రి ముద్ర, పీఎంఈజీపీ, గృహనిర్మాణం, ఉన్నత విద్య కోసం అర్హులైన వారికి రుణాలు అందించాలని సూచించారు. గ్రామాలలో ఖాతా దారులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ వందశాతం పూర్తి చేయాలని చెప్పారు. రుణాల రికవరీ చేసి నూతన సంఘాలకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. ట్రైకార్ షెడ్యూల్ కులాల రుణాలను నిబంధనల ప్రకారం త్వరగా మంజూరు చేయాలని తెలిపారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, డీడీ జాదవ్ అంబాజీ, ఎల్డీఎం జనార్దన్, ఎస్బీఐ ఆర్ఎం నితిష్‌కుమార్ గుప్తా, ఆర్బీఐ లీడ్ డిస్ట్రిక్ అధికారి చేతన్ బోరేకార్, డీజీబీ బ్యాంకు ప్రతినిధులు తిరుపతి, మస్తాన్, వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు, వివిద శాఖల అదికారులు పాల్గొన్నారు.