బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 10:45 PM
బ్యాంకుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యుఎఫ్‌బీయు పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యో గులు మంచిర్యాలలోని రెడ్డి కాలనీ ఎస్‌బీఐ బ్యాంకు ముందు ధర్నా చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : బ్యాంకుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యుఎఫ్‌బీయు పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యో గులు మంచిర్యాలలోని రెడ్డి కాలనీ ఎస్‌బీఐ బ్యాంకు ముందు ధర్నా చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు మా ట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో సిబ్బంది కొరత, అధిక పనిభారం, లక్ష్యాల ఒత్తిడి, డిజిటైజేషన్ పేరుతో పెరుగుతున్న బాధ్యతలు ఉద్యోగులపై తీవ్ర మానసిక శారీరక ఒత్తిడిని కలిగిస్తున్నాయన్నారు. ఇప్పటికే ఎస్‌ఈబీ, ఐఎల్ ఐసీ, నాబార్డు, ఐఆర్‌డీఏ తదితర ఆర్థిక సంస్థల్లో వారానికి ఐదు రోజుల పని విధానం అమలులో ఉందని, బ్యాంకు ఉద్యోగులకు మాత్రం అమలు చే యకపోవడం అన్యాయమన్నారు. వెంటనే వారానికి ఐదు రోజుల పని వి ధానం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐఎస్ యూ హెచ్‌సీ మంచిర్యాల రీజియన్ సెక్రటరీ కొక్కుల శ్రీనివాస్, ఎల్డీఎం తిరుపతి, ఏఐబీఓసీఆర్‌ఎస్ వెంకటేష్, అశోక్, సత్యనారాయణ, వసంత్‌కుమార్, విష్ణు, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.