మద్దిమడుగుకు బంజారాలు తరలి రావాలి
ABN , Publish Date - Nov 24 , 2026 | 11:34 PM
పదర మండలంలోని మద్దిమ డుగులో ఈనెల 26న సీఎం రేవంత్ రె డ్డి సంత్‌సేవాలాల్ విగ్రహప్రతిష్ఠ కోసం భూమి పూజ కార్యక్రమం చేస్తున్నందున జిల్లాలోని బంజారాలు అధిక సంఖ్యలో తరలి రావాలని బంజారా నాయకుడు ముడావత్ గోవింద్ నాయక్ కోరారు.
బిజినేపల్లి, నవంబరు 24 (ఆంధ్ర జ్యోతి) : పదర మండలంలోని మద్దిమ డుగులో ఈనెల 26న సీఎం రేవంత్ రె డ్డి సంత్‌సేవాలాల్ విగ్రహప్రతిష్ఠ కోసం భూమి పూజ కార్యక్రమం చేస్తున్నందున జిల్లాలోని బంజారాలు అధిక సంఖ్యలో తరలి రావాలని బంజారా నాయకుడు ముడావత్ గోవింద్ నాయక్ కోరారు. మండల కేంద్రంలో మంగళవారం మండ ల బంజారా సర్పంచులు, ముఖ్య నాయకు లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మం డలంలోని 24 తండాల నుంచి కనీసం వెయ్యి మంది తగ్గకుండా హాజరయ్యేలా కృషి చేయా లని సూచించారు. ఆయా తండాలకు సంబంధి త సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు కేతావత్ మాన్యనాయక్, కాట్రావత్ చందులాల్, కేతావత్ రవినాయక్, అంగోత్ లక్ష్మణ్ నాయక్, హన్మనాయక్, పాండు నాయక్, గోపాల్ నాయ క్, నర్సింగ్ నాయక్, బదావత్ పాండు నాయక్, అమర్ నాయక్, రాజు నాయక్ తదితరులు ఉన్నారు.