Share News

బంజారాల ఎస్టీ గుర్తింపునకు 50 ఏళ్లు

ABN , Publish Date - May 27 , 2026 | 04:56 AM

తెలంగాణలోని బంజారాలను (లంబాడాలను) ఎస్టీ జాబితాలో చేర్చి వచ్చే సెప్టెంబరు 18 నాటికి 50 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవాలను ....

బంజారాల ఎస్టీ గుర్తింపునకు 50 ఏళ్లు

  • రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వర్ణోత్సవాలు

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని బంజారాలను (లంబాడాలను) ఎస్టీ జాబితాలో చేర్చి వచ్చే సెప్టెంబరు 18 నాటికి 50 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించాలని బంజారా ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన లంబాడా ప్రజాప్రతినిధులు, ప్రముఖ నేతల సమావేశంలో ఈ మేరకు పలు తీర్మానాలు చేశారు. నాడు బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా క్షీరాభిషేకాలు నిర్వహించనున్నారు. జూన్‌లో తెలంగాణలోని ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున ప్రదర్శనలు, ర్యాలీలు, బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు.

Updated Date - May 27 , 2026 | 04:56 AM