kumaram bheem asifabad-బంగ్లాదేశీ వలసదారుల కలకలం
ABN , Publish Date - May 26 , 2026 | 10:36 PM
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఈ ప్రాంతాన్ని విడిచి పెట్టి పోవాలన్న స్పష్టమైన ఆదేశాలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేయడంతో కొంత మంది కాగజ్‌నగర్ వైపు రావడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కాగజ్‌నగర్ ఈసుగాం ఎస్సై ఆధ్వర్యంలో క్యాంపులో 12లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో బంగ్లాదేశ్‌కు చెందిన ఎనిమిది మందిని గుర్తించారు.
కాగజ్‌నగర్, మే 26 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఈ ప్రాంతాన్ని విడిచి పెట్టి పోవాలన్న స్పష్టమైన ఆదేశాలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేయడంతో కొంత మంది కాగజ్‌నగర్ వైపు రావడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కాగజ్‌నగర్ ఈసుగాం ఎస్సై ఆధ్వర్యంలో క్యాంపులో 12లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో బంగ్లాదేశ్‌కు చెందిన ఎనిమిది మందిని గుర్తించారు. వీరి వద్ద ఎలాంటి ఆధార్‌కార్డు లభించలేదు. తాము కోల్‌కతాకు వచ్చి అక్కడి నుంచి ఈ క్యాంపుకు వచ్చినట్టు పలువురు అంగీకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. బంగ్లాదేశ్ పౌరసత్వం పొందిన వారి కోల్‌కతాకు వచ్చి గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. గత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీరి విషయంలో పెద్దగా చర్యలు చేపట్ట లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారి పోవడంతో బీజేపీ అధికారంలోకి రావటంతో బంగ్లాదేశ్ వలస దారులపై నిఘా పెట్టడంతో స్వస్థలాలకు వెళ్లి పోతున్నారు. కాని కొంత మంది బెంగాళీ క్యాంపుల్లో నివాసం ఉండేందుకు ఇక్కడికి వస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంల పోలీసులు గట్టి నిఘా పెట్టి తనిఖీలు చేపట్టారు. కేవలం 12 క్యాంపుల్లోనే ఎనిమిది మంది గుర్తించడం చర్చనీయాంశమైంది. ఇంకా మిగితా క్యాంపుల్లో కూడా పక్కాగా తనిఖీలు చేపట్టాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. బంగ్లావాసులు ఇక్కడి ఉండడం, ఇక్కడి పౌరసత్వం పొందేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఆధార్, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే వారిపై పక్కాగా నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఈసుగాం ఎస్సై నరేష్‌ను వివరణ కోరాగా నాలుగు రోజుల క్రితం ఈసుగాం క్యాంపు 12లో తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఎనిమిది మంది బంగ్లాదేశ్ వాసులను గుర్తించినట్టు తెలిపారు. వీరంతా కూడా బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చినట్లు అంగీకరించారని తెలిపారు. వీరి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఎస్సై తెలిపారు.