Share News

సంజయ్‌ మహాపాదయాత్ర

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:34 AM

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ తన మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని....

సంజయ్‌ మహాపాదయాత్ర

హైదరాబాద్‌, మార్చి 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ తన మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో పాటు ఉమ్మడి జిల్లాలో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఆయన ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో మహా పాదయాత్ర చేపట్టనున్నారు. శనివారం ఉదయం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టుదాకా పదివేల మందితో ఈ యాత్ర సాగనుంది.

Updated Date - Mar 13 , 2026 | 04:34 AM