మహిళా బిల్లును అడ్డుకుంటే చరిత్రహీనులవుతారు: బండి సంజయ్
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:00 AM
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే చరిత్రహీనులవుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ ...
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే చరిత్రహీనులవుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ పార్లమెంటులో బిల్లుకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు. ‘మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు దశాబ్దాల నాటి కల. ఈ కలను సాకారం చేసే దిశగా ప్రధాని మోదీ చేస్తున్న కృషి చారిత్రాత్మకం. మహిళల ఆశలు, ఆకాంక్షలకు ఈ బిల్లు ప్రతీక’ అని సంజయ్ ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్‌తో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశం లభిస్తుందని వివరించారు.