శృంగేరి పీఠాన్ని సందర్శించిన బండి సంజయ్
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:38 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కర్ణాటకలోని శృంగేరీ శారద పీఠాదీశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కర్ణాటకలోని శృంగేరీ శారద పీఠాదీశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శారద పీఠంలో ఉత్తరాధికారి విధుశేఖర భారతి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సహస్ర నారికేళ హవనం మహాయజ్ణం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శృంగేరీ శారదాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠ తెలంగాణ బాధ్యులు వ్యాసోజుల రాధాకృష్ణ శర్మ కూడా పాల్గొన్నారు.