సోషల్ మీడియాకు లక్ష్మణరేఖ తప్పనిసరి
ABN , Publish Date - Jul 22 , 2026 | 04:54 AM
‘సోషల్ మీడియాకు లక్ష్మణ రేఖ తప్పనిసరి. తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మం పై సోషల్ మీడియా ద్వారా దాడికి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలి.
అర్బన్ నక్సల్స్ ముసుగులో సనాతన ధర్మంపై దాడి
ఎంపీ లింగమనేనితో కేంద్ర మంత్రి సంజయ్
పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై బండి ఆరా
న్యూఢిల్లీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): ‘సోషల్ మీడియాకు లక్ష్మణ రేఖ తప్పనిసరి. తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మం పై సోషల్ మీడియా ద్వారా దాడికి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలి. టార్గెట్ చేసి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు విషపూరిత ప్రచారం చేస్తున్న యూ ట్యూబ్ చానళ్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇటీవల జనసేన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన లింగమనేని రమేశ్.. మంగళవారం సంజయ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకొ న్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ర్టాల్లో సోషల్ మీడియా వ్యవహరిస్తున్న తీరు, జర్నలి జం ముసుగులో కొందరు, వ్యక్తులను టార్గెట్ చేసి, విష ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వ్యవహారం ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. అలాంటి వారిపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ‘అర్బన్ నక్సల్స్ ముసుగులో కొందరు సనాతన ధర్మంపై దాడి చేస్తూ హైందవ సంస్కృతిని కించపరుస్తున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా నేరుగా ఎదుర్కోవడం చేతగానివాళ్లు, జర్నలిజం, మేధావుల ముసుగులో కొందరు అర్బన్ నక్సల్స్ సంస్కృతిపై దాడి చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలు, బూ తులతో శ్రుతి మించుతున్న సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చించి కార్యాచరణ రూపొందించేందుకు యత్నిస్తున్నాం’ అని బండి చెప్పారు.