Minister Bandi Sanjay: ఐఎన్‌సీ అంటే.. ఇటలీ నేషనల్ కాంగ్రెస్
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:37 AM
బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.
రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పుట్టుకనే మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీని బ్రిటిష్ పార్టీ అంటున్న రేవంత్, అసలు కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఒక బ్రిటిష్ అధికారి అన్న విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఐఎన్‌సీ అంటే ‘‘ఇటలీ నేషనల్ కాంగ్రె్‌స’’గా మారిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడు దశాబ్దాలుగా పెంచిన బానిస మనస్తత్వాన్ని తాము తొలగిస్తున్నట్లు బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఓట్ల కోసం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే కాంగ్రెస్ పార్టీ, ‘విభజించి పాలించు’ అని మాట్లాడ్డం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కొత్తగా ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీలో రాజకీయాలకు సంబంధించి ఒక కోర్సు పెట్టాలని, ఆ కోర్సులో మొదటి విద్యార్థి ఆయనే కావాలని సంజయ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.