Share News

రిటైర్డు ఉద్యోగుల బెనిఫిట్స్‌ వెంటనే ఇవ్వండి

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:33 AM

ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ డీఏలు, రిటైర్డ్‌ ఉద్యోగుల బెన్‌ఫిట్స్‌, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌..

రిటైర్డు ఉద్యోగుల బెనిఫిట్స్‌ వెంటనే ఇవ్వండి

  • సీఎం రేవంత్‌రెడ్డికి సంజయ్‌ లేఖ

హైదరాబాద్‌/భగత్‌నగర్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ డీఏలు, రిటైర్డ్‌ ఉద్యోగుల బెన్‌ఫిట్స్‌, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. రిటైర్డ్‌ ఉద్యోగుల బెన్‌ఫిట్స్‌ బకాయిలను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుని వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘రాష్ట్రంలో 3 లక్షల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు, 4 లక్షల మందికిపైగా రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం 5 డీఏలను ఇవ్వాల్సి ఉంది. ఉద్యోగులు దాచుకున్న గ్రాట్యుటీ, ఈపీఎఫ్‌, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ బకాయిలను కూడా చెల్లించడం లేదు. 2023 జూలై నుండి అమలు చేయాల్సిన పీఆర్సీ ఊసే ఎత్తకపోవడం శోచనీయం. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన సొమ్మును కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. 2024 నుంచి నేటి వరకు దాదాపు 13 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. నాటి నుంచి వారికి రావాల్సిన బెన్‌ఫిట్స్‌, 5 డీఏలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఆయా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే బీజేపీ పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది’’ అని మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి సంజయ్‌ లేఖ రాశారు.

Updated Date - Feb 11 , 2026 | 02:33 AM