బండి సంజయ్ తల్లికి గుండె పోటు
ABN , Publish Date - May 16 , 2026 | 05:05 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు రావడంతో ఆమెను కరీంనగర్ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ ....
హైదరాబాద్, మే 15(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు రావడంతో ఆమెను కరీంనగర్ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు స్టెంట్ వేసి అత్యవసర చికిత్స అందించారు. ఆసుపత్రికి చేరుకున్న బండి సంజయ్ తల్లిని పలుకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం శకుంతల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.