మంది కొంపలు ముంచి వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడతారా?
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:17 AM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంది కొంపలు ముంచి వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడతారా..
బీజేపీకి అధికారమిస్తే కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపేవాళ్లం
ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగదీత: బండి సంజయ్
హైదరాబాద్/కరీంనగర్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంది కొంపలు ముంచి వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడతారా?, ఫోన్ ట్యాపింగ్ చేసి దేశ భద్రత కోసమేనని చెప్పడానికి సిగ్గు లేదా? అంటూ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ సిరిసిల్ల కేంద్రంగా వార్ రూం ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని చాలా సార్లు చెప్పానన్నారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ, బీఆర్‌ఎస్ నేతలతో లోపాయకారీ ఒప్పందాలు కుదుర్చుకుంటోందని ఆరోపించా రు. ఇలా హడావుడి చేసినప్పుడల్లా ఫాంహౌజ్ నుంచి ఏఐసీసీకి ముడుపులు ముడుతున్నాయని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అరాచకాలు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని విమర్శలు చేశారు. బీజేపీకి అధికారం అప్పగిేస్త కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపేవాళ్లమంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ టీవీ సీరియల్‌ను మించి కొనసాగుతోందని, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మావోయిస్టుల హిట్‌లి్‌స్టలో ఉన్నట్లు తప్పుడు సమాచారంతో తన ఫోన్‌తో పాటు రేవంత్ రెడ్డి ఫోన్‌ను గత ప్రభుత్వంలో ట్యాప్ చేశారని.. పోలీసులు తనను విచారించినప్పుడు చెప్పారని బండి సంజయ్ వెల్లడించారు. చివరకు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసే పరిస్థితికి వచ్చారంటే, ఇక సామాన్యుల పరిస్థితేంటంటూ ప్రశ్నించారు. ‘కేటీఆర్ ఇచ్చిన ేస్టట్ మెంట్ ను వాంగ్మూలంగా భావించి పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్రోన్ ఎగుర వేశారని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డికి, వేల ఫోన్లను ట్యాప్ చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. బిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా చేసినా.. వాళ్లపై చర్యలు తీసుకోవడం లేదంటే.. అసలు రేవంత్ రెడ్డికి పౌరుషమే లేదంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ కూతురు స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారని, మాజీ మంత్రి హరీశ్‌రావు ఏడాది పాటు ఫోనే వాడలేదని అంటున్నారని.. ఇన్ని సాక్ష్యాలున్నా ఇప్పటివరకు ఏ ఒక్క రాజకీయనాయకుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని బండి సంజయ్ నిలదీశారు. కేసీఆర్ పాలనలో సామాన్యులు మొదలు భిక్షాటన చేేస వ్యక్తులు కూడా ఫోన్ ఉన్నా వాట్సప్ కాల్‌లో తప్ప నార్మల్ కాల్ మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.
రేవంత్‌కు ముడుపులు ముట్టినట్లే: ఎంపీ అర్వింద్
జగిత్యాల అగ్రికల్చర్/కోరుట్ల, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను జైలుకు పంపకపోతే సీఎం రేవంత్‌రెడ్డికి ముడుపుల ముట్టినట్లే భావించాల్సి ఉంటుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్లలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు అభ్యర్థులు దొరకరని, ఆ పార్టీ నేతలంగా జైళ్లలోనే ఉంటారని జోస్యం చెప్పారు.