Share News

రాజకీయాలకతీతంగా స్కూళ్లను శుభ్రం చేద్దాం: సంజయ్‌

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:50 AM

రాజకీయాలకు అతీతంగా మన స్కూళ్లను శుభ్రం చేసుకుందామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రిగా మోదీ బాధ్యతలు...

రాజకీయాలకతీతంగా స్కూళ్లను శుభ్రం చేద్దాం: సంజయ్‌

  • సిరిసిల్ల ఎస్పీ మహేశ్‌ బీ గీతేపై సంజయ్‌ ఆగ్రహం

  • అంత ప్రేమ ఉంటే.. బీఆర్‌ఎ్‌సలోనే చేరాలని ధ్వజం

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : రాజకీయాలకు అతీతంగా మన స్కూళ్లను శుభ్రం చేసుకుందామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టి 12ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు సిరిసిల్లలోని కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలను బీజేపీ నాయకులతో కలిసి సంజయ్‌ సందర్శించారు. చీపురు పట్టి ఊడ్చి తరగతి గదులను శుభ్రం చేశారు. విద్యార్థులు కూర్చునే బెంచీలు, టేబుళ్లను తుడిచారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో అన్ని పాఠశాలలను శుభ్రం చేయాలని నిర్ణయించామన్నారు. కాగా, సిరిసిల్లలో తాను పర్యటిస్తుండగా.. ఎస్పీ మహేశ్‌ గీతే గైర్హాజరు కావడంపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి స్వాగతం పలకడంపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీ ఎస్పీకి నేను బీజేపీ కార్యకర్తలా కనిపిస్తున్నానా. కేటీఅర్‌పై అంత ప్రేమ ఎందుకు..? బీఅర్‌ఎ్‌సపై అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలో చేరమని చెప్పండి’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 14 , 2026 | 04:50 AM