Share News

ప్రజా వంచన బడ్జెట్‌: బండి సంజయ్‌

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:13 AM

మోసం.. దగా.. ప్రజా వంచన బడ్జెట్‌ ఇది..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల ఆర్భాటాలు...

ప్రజా వంచన బడ్జెట్‌: బండి సంజయ్‌

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ‘మోసం.. దగా.. ప్రజా వంచన బడ్జెట్‌ ఇది..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలే తప్ప ఒరిగేందేమీ లేదని ఆరోపించారు. మరో రూ.లక్ష కోట్లు అదనంగా అప్పు భారం మోపేందుకు సిద్థమవ్వడం సిగ్గుచేటు అని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ‘కేంద్రంపై ఆధారపడటం తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదు. రైతు భరోసా పైసలు రెండు విడతలు ఎగ్గొట్టినట్లేనా? రూపాయి బిళ్ల కూడా ఇవ్వకుండా కౌలు రైతులు, వ్యవసాయ కూలీల నోట్లో మళ్లీ మట్టికొట్టారు. మహిళలకు తులం బంగారం తుస్‌.. రూ.2500లు పథకానికి కేటాయింపులు నిల్‌. అవ్వాతాతలకు. రూ.4వేల పెన్షన్‌ పెంపు ఊసే లేదు. 6 గ్యారంటీలకు పాడె కట్టారు. 56ు ఉన్న బీసీ జనాభాకు 4ు కేటాయింపులా? ఎస్సీ, ఎస్టీలకు సైతం బడ్జెట్‌ కేటాయింపుల్లో అన్యాయం చేశారు. మైనారిటీలకు గత ఏడాదికంటే ఎక్కువ నిధులు కేటాయించడం విడ్డూరం’ అని సంజయ్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 04:13 AM