Share News

దేశానికి రాహుల్‌ ఓ గ్రహణం

ABN , Publish Date - Mar 04 , 2026 | 02:58 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశానికి పట్టిన ఓ గ్రహణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

దేశానికి రాహుల్‌ ఓ గ్రహణం

  • ప్రధాని పదవి వారసత్వంగా రాదు: బండి సంజయ్‌

హైదరాబాద్‌, మార్చి3(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశానికి పట్టిన ఓ గ్రహణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. రాహుల్‌ దేశ ప్రధాని కాలేరని, ఆ పదవి వారసత్వంగా రాదని సీఎం రేవంత్‌రెడ్డికీ తెలుసని వ్యాఖ్యానించారు. భజన ఆపి బాధ్యతలు నిర్వర్తించాలని హితవు పలికారు. ఈ మేరకు సంజయ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘ఈ రాహుల్‌ గ్రహణం మూడుసార్లు దేశాన్ని చీకటిలో ముంచేందుకు ప్రయత్నించింది. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్థి కిరణాలు ప్రతీసారి వెలుగునిచ్చాయి. ఇది ప్రజాస్వామ్యం మీ నిజాం శైలి దర్బార్‌ కాదు.’ అని స్పష్టం చేశారు. ‘ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదు. దేశం అభివృద్థి రంగులతో హోలీ జరుపుకొంటుంటే, కాంగ్రెస్‌ అవినీతి మసితో మసకబారింది. మీ గ్యారంటీలు, మీ యువరాజు ఆశలను దహనం చేయడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎంత గులాల్‌ చల్లినా దేశం తిరస్కరించిన నాయకుడి వైఫల్యాన్ని దాచలేరు’ అని సంజయ్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 02:58 AM