సీఐఎస్ఎఫ్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:02 AM
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఆధునికీకరణ, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలకు నిరంతర మద్దతు అందిస్తామని...
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
సీఐఎస్ఎఫ్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన
న్యూఢిల్లీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఆధునికీకరణ, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలకు నిరంతర మద్దతు అందిస్తామని, సీఐఎస్ఎఫ్‌ను ప్రపంచంలోనే అత్యాధునిక భద్రతా దళంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన వనరులను సమకూరుస్తామని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు, భద్రతా పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో సీఐఎస్ఎఫ్‌కు కొత్త భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. న్యూఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో 75.78 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీఐఎస్ఎఫ్ నూతన ప్రధాన కార్యాలయ భవనానికి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఐఎస్ఎఫ్ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు.