‘చర్లపల్లి’కి బండి సాయి భగీరథ్
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:31 AM
మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు గురువారం తిరిగి చర్లపల్లి....
కుషాయిగూడ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు గురువారం తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. పోక్సో కేసులో నిందితుడిగా చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సాయి భగీరథ్‌కు తన ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు మేడ్చల్-మల్కాజిగిరి కోర్టు ఈనెల 20న మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గడువు ముగియడంతో న్యాయమూర్తి బి.తిరుపతి ఎదుట గురువారం హాజరైన భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు.