Share News

బండి భగీరథ్‌తో తల్లి అపర్ణ ‘ములాఖత్‌’

ABN , Publish Date - May 20 , 2026 | 04:00 AM

పోక్సో కేసులో రిమాండ్‌ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న బండి సాయి భగీరథ్‌ను ఆయన తల్లి అపర్ణ, బంధువులు మంగళవారం ‘ములాఖత్‌’ ...

బండి భగీరథ్‌తో తల్లి అపర్ణ ‘ములాఖత్‌’

కుషాయిగూడ, మే 19 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో రిమాండ్‌ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న బండి సాయి భగీరథ్‌ను ఆయన తల్లి అపర్ణ, బంధువులు మంగళవారం ‘ములాఖత్‌’ అయినట్లు సమాచారం. వారిలో ఇద్దరు న్యాయవాదులు ఉన్నట్లు తెలిసింది. దాదాపు 40 నిముషాల పాటు భేటీ జరిగిందని, తల్లిని చూసి బండి భగీరథ్‌ ఉద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. వారు తెచ్చిన తినుబండారాలలో ప్యాకింగ్‌ చేసి ఉన్నవాటిని అనుమతించిన జైలు అధికారులు, మిగతా వస్తువులను తిరస్కరించినట్లు సమాచారం. కాగా, ఈ ములాఖత్‌ వివరాలను జైలు అధికారులు ధ్రువీకరించలేదు.

Updated Date - May 20 , 2026 | 04:00 AM