కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బండి రమేశ్
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:40 AM
తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా బండి రమేశ్, వైస్ చైర్మన్‌గా పరుచూరి మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో...
హైదరాబాద్, జూలై 1(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా బండి రమేశ్, వైస్ చైర్మన్‌గా పరుచూరి మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వారు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేషన్ ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థంగా అమలు చేేసందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.