Share News

బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీసు కస్టడీ

ABN , Publish Date - May 27 , 2026 | 05:21 AM

పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను మూడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్‌ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీసు కస్టడీ

  • అనుమతిస్తూ మేడ్చల్‌ జిల్లా కోర్టు ఆదేశాలు

  • డీసీపీ రితిరాజ్‌ పర్యవేక్షణలో నేడు విచారణ

హైదరాబాద్‌ సిటీ/మేడ్చల్‌, మే 26(ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను మూడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్‌ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీసీపీ రితిరాజ్‌ పర్యవేక్షణలో భగీరథ్‌ను బుధవారం విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిచాడన్న ఆరోపణలతో బండి బగీరథ్‌పై ఈ నెల 8న పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసు విచారణాధికారి కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ ఆదేశాలతో 5 బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు.. ఈనెల 16న భగీరథ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, నిందితుడిని పూర్తిస్థాయిలో విచారించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు.. ఈ ఆరోపణలు నిజం కాదని, కుట్రపూరితంగా ఇరికించారని, ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని భగీరథ్‌ తరఫు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం వాదనలు విన్న మేడ్చల్‌ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి తిరుపతి.. పోలీసుల వాదనతో ఏకీభవించారు. బండి భగీరథ్‌ను మూడు రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్‌ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా, నిందితుడిని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారిస్తారా? లేక విచారణ పర్యవేక్షణ అధికారి డీసీపీ రితిరాజ్‌ కార్యాలయంలో విచారిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - May 27 , 2026 | 05:21 AM