హైకోర్టులో బండి భగీరథ్ బెయిల్ పిటిషన్
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:27 AM
పోక్సో కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ బండి సాయి భగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సుజన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పోక్సో కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ బండి సాయి భగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సుజన ధర్మాసనం విచారణ చేపట్టింది. భగీరథ్ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారని, పిటిషనర్ 49 రోజులుగా జైల్లో ఉంటున్నారన్నారు. దర్యాప్తు పూర్తయినందున పిటిషనర్ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశమే లేదన్నారు.5 నెలల అసాధారణ ఆలస్యం తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని పేట్‌బషీరాబాద్ పోలీసులను కోర్టు ఆదేశించింది.