Share News

ముగిసిన బండి భగీరథ్‌ విచారణ

ABN , Publish Date - May 30 , 2026 | 03:44 AM

పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను కస్టడీకి తీసుకున్న పేట్‌బషీరాబాద్‌ పోలీసులు డీసీపీ రితిరాజ్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు విచారించారు.

ముగిసిన బండి భగీరథ్‌ విచారణ

హైదరాబాద్‌ సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను కస్టడీకి తీసుకున్న పేట్‌బషీరాబాద్‌ పోలీసులు డీసీపీ రితిరాజ్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు విచారించారు. శుక్రవారం కస్టడీ ముగియడంతో మేడ్చల్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు భగీరథ్‌ను కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో తిరిగి అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఠాణాలో మూడు రోజుల పాటు భగీరథ్‌ను పలు కోణాల్లో ప్రశ్నించి పోలీసులు సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. మొదటి రోజు మొయినాబాద్‌ ఫాంహౌ్‌సకు తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు.. రెండో రోజు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. మూడో రోజు బాధితురాలి తల్లి సమర్పించిన కాల్‌ రికార్డులు, వాట్సాప్‌, స్నాప్‌చాట్‌ చాటింగ్‌లపై పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

Updated Date - May 30 , 2026 | 03:44 AM