తేజస్వి సూర్య తెలంగాణకు వస్తే అడ్డుకుంటాం
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:07 AM
తెలంగాణ అస్తిత్వాన్ని, సెంటిమెంట్‌ను అవమానించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్రంలో అడుగుపెడితే సహించేది లేదని, ఆయన పర్యటనను కచ్చితంగా అడ్డుకుంటామని...
ఆయన క్షమాపణ చెప్పాల్సిందే: బల్మూరి
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ అస్తిత్వాన్ని, సెంటిమెంట్‌ను అవమానించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్రంలో అడుగుపెడితే సహించేది లేదని, ఆయన పర్యటనను కచ్చితంగా అడ్డుకుంటామని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ హెచ్చరించారు. తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చి మాట్లాడిన తేజస్వి సూర్య వ్యాఖ్యలు బీజేపీ తెలంగాణ వ్యతిరేక విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. పార్లమెంట్‌లో ఆనాడు ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించలేని రాష్ట్ర బీజేపీ నేతలు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆయన్ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పకుండా హైదరాబాద్‌లో ‘నమో జెన్ జీ కాంక్లేవ్’ సమావేశానికి హాజరైతే యువత ఆగ్రహాన్ని చవి చూడక తప్పదన్నారు.