Share News

మీలా డ్రగ్‌ కల్చర్‌ను సీఎం ప్రమోట్‌ చేయలేదు

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:27 AM

ఏ వయసులోనైనా చదువుకోవచ్చంటూ హార్వర్డ్‌ యూనివర్సిటీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఒక సందేశాన్నిచ్చే ప్రయత్నం చేస్తే దానిని కేటీఆర్‌ హేళన చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్‌...

మీలా డ్రగ్‌ కల్చర్‌ను సీఎం ప్రమోట్‌ చేయలేదు

  • కేటీఆర్‌పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ధ్వజం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఏ వయసులోనైనా చదువుకోవచ్చంటూ హార్వర్డ్‌ యూనివర్సిటీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఒక సందేశాన్నిచ్చే ప్రయత్నం చేస్తే దానిని కేటీఆర్‌ హేళన చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ధ్వజమెత్తారు. కేటీఆర్‌లా ఆయనేమీ విదేశీ యూనివర్సిటీ కార్యక్రమాల పేరుతో డ్రగ్‌ కల్చర్‌ను ప్రమోట్‌ చేయలేదు కదా? అని నిలదీశారు. పదేళ్ల పాటు కేటీఆర్‌ విదేశాల్లో తిరిగి ఒరగబెట్టింది ఏందన్నది తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దివాలా తీయించిన వారు.. నేడు సిట్‌ విచారణకు కేసీఆర్‌ను పిలిస్తే తెలంగాణ అస్తిత్వాన్నే దెబ్బతీసినట్లు మాట్లాడతున్నారని విమర్శించారు.

Updated Date - Feb 03 , 2026 | 03:27 AM